ఏపీలో కొత్తగా 7,293 కరోనా కేసులు

13

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ విలయతాండవం చేస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,293 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 57 మంది వైరస్ బారిన పడి మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,68,751 కు చేరాయి. మరణాల సంఖ్య 5,663కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 65,794గా ఉన్నాయి. వైరస్ బారిన నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి 5,97,294 మంది డిశ్చార్జి అయ్యారు.