స్ఫూర్తి ప్రదాత ఈ చిన్నారి.. సర్జరీ కోసం లెమనాడ్ సేల్

by  |
US Girl
X

దిశ, ఫీచర్స్: విషయం చిన్నదో లేక పెద్దదో కానీ అంతమాత్రానికే ‘లైఫ్’ ‌కు ఫుల్‌స్టాప్ పెట్టేస్తున్నారు చాలామంది. ‘ఫిదా’లో భానుమతే కాదు ప్రతి ఒక్కరూ రేర్ అండ్ యూనిక్ పీసెస్. వెంటపడే కుక్కను..తిరగబడి తరిమితే పారిపోయినట్లు చిన్నాచితకా బాధలు అంతే. గొప్ప జీవితం ముందు అల్పమైన విషయాలను శిఖరమంతా చేస్తున్న అందరికీ ఏడేళ్ల చిన్నారి తన పోరాటపటిమతో స్ఫూర్తిని అందిస్తోంది. అమెరికాలోని అలబామాకు చెందిన లిజా స్కాట్ అనే అమ్మాయి తన బ్రెయిన్ సర్జరీ‌కి నిధులు సమకూర్చడానికి నిమ్మరసం అమ్ముతోంది. అందుకోసం తన తల్లి బేకరీలో లెమనాడ్ స్టాల్ ప్రారంభించింది. లిటిల్ ఫైటర్ లిజా గురించి మరిన్ని విషయాలు మీ కోసం.

లిజా స్కాట్ తల్లి ఎలిజబెత్ ఒంటరి మహిళ. స్థానికంగా బేకరి నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తోంది. లిజా స్కాట్ ఇటీవల కాలంలో భయపడుతూ మూర్ఛతో కొట్టామిట్టాడింది. పీడకలలతో భయపడి అలా చేస్తుందని తల్లి మొదట భావించింది. కానీ లిజా రెగ్యులర్‌గా అలానే చేస్తుండటంతో వైద్యుల్ని సంప్రదించగా..లిజా ‘మెదడు’లో మూడు డిఫెక్ట్స్ (మాల్‌ఫార్మేషన్) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. అవి స్కిజెన్‌సెఫాలి(మెదడులో చీలక), ప్యారిటల్ ఆర్టిరియోవెనస్ మాల్‌ఫార్మేషన్(రక్తనాళాల సమూహంలో డిఫెక్ట్స్), డ్యూరల్ ఆర్టిరియోవెనస్ ఫిస్టులా(సిర, ధమనుల మధ్య రాంగ్ కనెక్షన్). ఈ క్రమంలో స్పెషలిస్ట్ డాక్టర్స్ మాత్రమే లిజాకు శస్త్ర చికిత్సలు చేయగలరు. అందుకోసం లిజాను బోసటన్‌ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఇప్పటికే లిజాకు రెండు మేజర్ ఆపరేషన్స్ జరగ్గా, ఎలిజబెత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్సూరెన్స్ ద్వారానే ఆ ఖర్చులు భర్తీ అయ్యాయి. ఇతర వైద్య, ప్రయాణ ఖర్చులతో పాటు మేజర్ బ్రెయిన్ ఆపరేషన్ చేయాల్సి ఉంది.

ఈ సయమంలో లిజా తన కుటుంబానికి ఆసరాగా ఉండాలని నిర్ణయించుకుంది. తన ఆపరేషన్ కోసం తనే డబ్బులు సమకూర్చుకోవాలని అనుకుంది. ఆమె శస్త్రచికిత్స ఖర్చులను భరించటానికి స్థానిక కమ్యూనిటీ మెంబర్స్‌తో పాటు, ఇంకెంతోమంది లిజా లెమనాడ్ స్టాల్‌కు వస్తున్నారు. అంతేకాదు ఆన్‌లైన్‌లో లిజాకు విరాళం ఇవ్వాలనుకునే వారి కోసం ‘మైటీ కాజ్ పేజీ’ని ఏర్పాటు చేయగా, దానికీ అనూహ్య స్పందన వస్తోంది. కొద్ది రోజుల్లోనే విరాళాల ద్వారా 3 లక్షల డాలర్లు సమకూరాయి. ‘నా సర్జరీ కోసం విరాళాలు సేకరిస్తునందుకు నాకెంతో సంతోషంగా ఉంది. నా బ్రెయిన్ సర్జరీ కోసం నేను ఎక్కువగా ఆలోచించదలుచుకోలేదు’ అని లిజా తెలిపింది.

‘లిజాను చూస్తే మాకెంతో గర్వంగా, సంతోషంగా ఉంది. ఆమె విజయాన్ని మేము ఎంజాయ్ చేస్తున్నాం. నిజంగా ఆమె ప్రత్యేకమే. దురదృష్టవశాత్తు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎక్కువ విరాళం ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ కొవిడ్ వల్ల ఆర్థికంగా ప్రభావితమయ్యారు. లిజా కథ చాలా మందిని ఉద్వేగానికి గురిచేసినా, ఆపరేషన్ చేయించుకునే వ్యక్తి సొంతంగా విరాళాలు సేకరించడం పట్ల కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా ఆరోగ్య సంస్థ పూర్తిగా విఫలమైందని క్రిటిక్స్ అంటున్నారు. ఆమెకు మరిన్ని సంవత్సరాల పాటు వైద్య సంరక్షణ అవసరం ఉంటుంది. ఎంఆర్ఐ, యాంజియోగ్రామ్‌ల‌తో చేయించాలి. తరుచుగా మందులు ఉండాలి. ఏదీ ఏమైనా లిజా పోరాటం స్ఫూర్తిదాయకం’ అని ఎలిజబెత్ పేర్కొన్నారు.


Next Story

Most Viewed