రికార్డ్ క్రియేట్ చేసిన ‘7 డేస్.. 6 నైట్స్’

by  |
రికార్డ్ క్రియేట్ చేసిన ‘7 డేస్.. 6 నైట్స్’
X

దిశ, సినిమా : టాలీవుడ్‌లో వరుస హిట్లతో స్టార్ ప్రొడ్యూసర్‌గా వెలుగొందిన ఎం.ఎస్ రాజు డైరెక్ట్ చేసిన న్యూ ఏజ్ ఫిల్మ్ ‘7 డేస్ 6 నైట్స్’. క్లిష్ట పరిస్థితుల నడుమ తక్కువ టైమ్‌లో షూటింగ్ పూర్తిచేసిన మూవీ టీమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. 100 మంది స్టాఫ్, 4 కెమెరాలతో గోవా, మంగళూరు, ఉడిపిలో లాస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన ఎం.ఎస్ రాజు అండ్ టీమ్.. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని అతి త్వరలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. ‘అనుకున్న దానికంటే త్వరగా చిత్ర షూటింగ్ పూర్తిచేశామని, క్లిష్ట పరిస్థితుల్లోనూ పట్టుదలతో పని చేసిన టీమ్‌కు థాంక్స్ చెప్పారు.

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌కు ఈ చిత్రంతో మళ్ళీ పూర్వ వైభవం వస్తుందన్నారు. అంతేకాదు ఈ చిత్రంతో అబ్బాయిని నిర్మాతగా పరిచయం చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇక హీరో/నిర్మాత సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ.. తన కెరీర్‌లోనే ఇది బెస్ట్ చిత్రంగా నిలిచిపోతుందని, తమ బ్యానర్‌లో క్లాసిక్ హిట్స్ మధ్య ఈ చిత్రం కూడా చేరుతుందని అభిప్రాయపడ్డారు. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలో వైల్డ్ హనీ ప్రొడక్షన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. వింటేజ్ పిక్చర్స్, ఏబీజీ క్రియేషన్స్ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. సమర్థ్ గొల్లపూడి సంగీతం అందించిన చిత్రానికి నాని చమిడిశెట్టి ఛాయాగ్రహణం అందించారు. ఇక సుమంత్ అశ్విన్, రజనీకాంత్ ఎస్ నిర్మాతలు కాగా.. రచన, దర్శకత్వం ఎంఎస్ రాజు.

Next Story