భద్రాద్రిలో రూ.7 కోట్ల గంజాయి పట్టివేత..

by  |
భద్రాద్రిలో రూ.7 కోట్ల గంజాయి పట్టివేత..
X

దిశ,కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. మంగళవారం రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో చుంచుపల్లి పోలీసులు బృందావనం వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో చేపల లోడుతో వెళ్తున్న రెండు ఐచర్ వాహనాలు తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న సుమారు మూడున్నర టన్నుల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దీని విలువ 7,36,62000 కోట్ల రూపాయలు ఉంటుందని ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. పట్టుబడ్డ నలుగురు వ్యక్తులు చింతూరు వద్ద గుర్తు తెలియని వ్యక్తుల నుండి గంజాయి కొనుగోలు చేసి ఆంధ్ర ప్రదేశ్‌కి ఒక వాహనం‌లో ఉన్న గంజాయిని, మరో వాహనాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా అదుపు చేయడానికి జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకుంటుందని గంజాయి అక్రమ రవాణాకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Next Story

Most Viewed