మహబూబ్‎నగర్‌లో 51 వేల మందికి ఉపాధి: మంత్రి శ్రీనివాస్ గౌడ్

by  |
మహబూబ్‎నగర్‌లో 51 వేల మందికి ఉపాధి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
X

దిశ, మహబూబ్‎నగర్: ఉపాధి హామీ పథకం కింద మహబూబ్‎నగర్ జిల్లాలో 51 వేల మంది కూలీలకు పనులు కల్పిస్తున్నట్లు మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం ఆయన మహబూబ్‎నగర్ జిల్లా హన్వాడ మండలం పల్లెమోని కాలనీ వద్ద అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కూలీలకు శానిటైజర్లు, మాస్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనులను జాగ్రత్తగా చేసుకోవాలని చెప్పారు. కూలీలు ఇబ్బందులు పడకుండా పనిచేసే చోట తాగునీటితోపాటు, నీడ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. లాక్‎డౌన్ కాలంలో కూడా జిల్లా అంతటా ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేశామని, అయినప్పటికీ జిల్లా ప్రజలు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు.

Tags: minister srinivas goud, inspection, Employment guarantee works, mahabubnagar


Next Story

Most Viewed