సార్స్ కొవిడ్-2 పై 4వ సర్వే

by  |
SARS Covid-2
X

దిశ, తెలంగాణ బ్యూరో: సార్స్ కొవిడ్-2 పై సెరో ప్రివిలెన్స్ నాలుగో సర్వేను ఐసీఎంఆర్, ఎన్ఐఏలు నేటి నుంచి నిర్వహించనున్నాయి. రాష్ట్రంలోని జనగాం, కామారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సర్వే చేపట్టనున్నట్టుగా ఐసీఎంఆర్, ఎన్ఐఏ ప్రకటించాయి. గతేడాది మే, ఆగస్ట్, డిసెంబర్ నెలల్లో మూడు విడుతల్లో ఈ సర్వేలు నిర్వహించినట్టుగా తెలిపారు.

10 నుంచి 17ఏళ్ల పిల్లలపై, 18 ఏళ్లు నిండిన వారందరిపై, హెల్త్ కేర్ వర్కర్లపై సర్వే చేపట్టామన్నారు. నాలుగో విడుత సర్వేలో తొలిసారిగా 6 నుంచి 9 ఏళ్ల పిల్లపై కూడా సర్వేలు చేపట్టనున్నట్టుగా ప్రకటించారు. ప్రజల్లో ఏ మేరక యాంటీబాడీలు విస్తరించి ఉన్నాయో గుర్తించేందుకు సర్వేలు చేపడుతున్నట్టుగా వివరించారు. సార్స్ కొవిడ్-2లో జరిగే మార్పులను ఈ సర్వేల ఆధారంగా గుర్తించి ముందస్తు నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని తెలిపారు.

మూడు జిల్లాలోని10 గ్రామాల్లో 400 మందిని సర్వే చేయనున్నట్టుగా ఐసీఎంఆర్, ఎన్ఐఏ డివిజనల్ పబ్లిక్ హెల్త్ ఉన్నతాధికారి లక్ష్మయ్య తెలిపారు. గ్రామాల నుంచి 300 మందిని ఎంపిక చేసుకోగా హెల్త్ కేర్ వర్కర్లలో 100 మందిని ఎంపిక చేస్తామన్నారు. జనాభా ఆధారిత నిర్వహించే సెరో ఎపిడెమియోలాజికల్ అధ్యయనాలు కమ్యూనిటీ స్థాయిలో కొవిడ్-19 సంక్రమణలు ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తించేందుకు ఉపయోగపడుతాయని ఐసీఎంఆర్, ఎన్ఐఏ డైరెక్టర్ డాకర్ట్ హేమలత తెలిపారు. సర్వేలు నిర్వహించేందకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.

Next Story

Most Viewed