- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో 41కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు
by Chukka Sudharani |
<p>తెలంగాణలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ ధృవీకరించింది. కాగా, రాష్ట్రంలో ఈ వైరస్ క్రమేణా వ్యాప్తి చెందుతుంది. కరోనా సోకిన ఇద్దరిలో మూడేళ్ల బాలుడు, 43 సంవత్సరాల మహిళ ఉన్నారు. అయితే, బాలుడు ఇటీవల సౌదీ అరేబియా నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కరోనా సోకిన మహిళ హైదరాబాద్ వాసి. అయితే, మహిళకు లోకల్ ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకింది. ఇటీవల తెలంగాణలో నమోదైన 34వ పాజిటివ్ కేసుకు సంబంధించిన 49 […]</p>

X
తెలంగాణలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య శాఖ ధృవీకరించింది. కాగా, రాష్ట్రంలో ఈ వైరస్ క్రమేణా వ్యాప్తి చెందుతుంది. కరోనా సోకిన ఇద్దరిలో మూడేళ్ల బాలుడు, 43 సంవత్సరాల మహిళ ఉన్నారు. అయితే, బాలుడు ఇటీవల సౌదీ అరేబియా నుంచి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కరోనా సోకిన మహిళ హైదరాబాద్ వాసి. అయితే, మహిళకు లోకల్ ప్రైమరీ కాంటాక్ట్ ద్వారా వైరస్ సోకింది. ఇటీవల తెలంగాణలో నమోదైన 34వ పాజిటివ్ కేసుకు సంబంధించిన 49 ఏళ్ల వ్యక్తి ఈ మహిళ తాలుకా అని సమాచారం. దేశంలోనే తొలిసారిగా మూడేళ్ల బాబుకు ఈ మహమ్మారి సోకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
tag: 49 Corona positive, cases, Telangana
Next Story






