ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఇలా చేస్తే 46 వేలు వరకు డిస్కౌంట్

by  |
ఐఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఇలా చేస్తే 46 వేలు వరకు డిస్కౌంట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉన్నప్పటికీ.. అందులో కొందరు మాత్రమే యాపిల్ మొబైల్ ను వాడుతున్నారు. యాపిల్ మొబైల్ ని సొంతం చేసుకోవాలని అందరికీ ఉంటుంది. అది ఓ డ్రీమ్ మొబైల్. యాపిల్ సంస్థ తన 13 వ సిరీస్ తో మార్కెట్ ని షేక్ చేస్తోంది. ఈ సిరీస్ లో 4 మోడల్స్ అందుబాటులోకి వచ్చాయి. అందులో.. ఐఫోన్ 13, 13 మినీ, 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్.. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. అయితే దీని స్టార్టింగ్ ధర 69,900 లు గా యాపిల్ సంస్థ నిర్ణయించింది. అయితే ఇంత ధర పెట్టి కొనలేని వారికి సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు రూ.46 వేలు డిస్కౌంట్లు ఇచ్చేందుకు ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ పొందాలనుకుంటున్నారా?.. మీ వద్ద ఉన్న ఏదైనా స్మార్ట్ ఫోన్ (వర్కింగ్)ను ఎక్స్‌చేంజ్ చేసి 46 వేల వరకూ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది. ఇంకేముంది.. ఈ ఆఫర్ ను వినియోగించుకోండి.. ఐఫోన్ పట్టేయండి.



Next Story

Most Viewed