- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కరోనాతో 45 రోజుల శిశువు మరణం
by B.Srinivas |
<p>న్యూఢిల్లీ: కేవలం 45 రోజుల వయసున్న శిశువు కరోనావైరస్ కారణంగా మరణించింది. ఢిల్లీలోని కళావతి శరణ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ఆ చిన్నారిని ఈ నెల 14న అడ్మిట్ చేశారు. కాగా, రెండు రోజుల తర్వాత ఆ శిశువుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం ఆ ఆడ శిశువు ప్రాణం కోల్పోయింది. కరోనా వయసుల కతీతంగా అందరికీ వ్యాపిస్తున్నది. శిశువు సహా పండు ముసలివరకు అందరికీ సోకుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఇంత చిన్న వయసు శిశువుకూ వైరస్ సోకడం.. […]</p>

X
న్యూఢిల్లీ: కేవలం 45 రోజుల వయసున్న శిశువు కరోనావైరస్ కారణంగా మరణించింది. ఢిల్లీలోని కళావతి శరణ్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో ఆ చిన్నారిని ఈ నెల 14న అడ్మిట్ చేశారు. కాగా, రెండు రోజుల తర్వాత ఆ శిశువుకు కరోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం ఆ ఆడ శిశువు ప్రాణం కోల్పోయింది. కరోనా వయసుల కతీతంగా అందరికీ వ్యాపిస్తున్నది. శిశువు సహా పండు ముసలివరకు అందరికీ సోకుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఇంత చిన్న వయసు శిశువుకూ వైరస్ సోకడం.. మరణించడం కలకలం రేపుతున్నది. 45 రోజుల శిశువు ఈ వైరస్ కారణంగా మరణించడం ఇదే మొదటిసారి. కాగా, మూడు రోజుల క్రితం ఇదే ఆస్పత్రిలో 10 నెలల చిన్నారి కొవిడ్ 19తో బాధపడుతూ చేరిందని ఓ వైద్యుడు తెలిపారు.
tags: coronavirus, pandemic, infant, died, infected
Next Story






