40శాతం మంది ట్రాఫిక్ రూల్స్ బ్రేకర్సే..!

by  |
40శాతం మంది ట్రాఫిక్ రూల్స్ బ్రేకర్సే..!
X

దిశ, ఏపీబ్యూరో: ఓ వైపు భారీ జరిమానాలు విధిస్తున్నా ట్రాఫిక్ ​నిబంధనలు పాటించని వాళ్లు ఏపీలో 40 శాతం మంది ఉన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టంచేసింది. గత నాలుగేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తూ ట్రాన్స్‌పోర్టు రీసెర్చి వింగ్‌ శుక్రవారం ఓ నివేదిక వెల్లడించింది.

మన రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు, వాటి కారణాలను ఈ నివేదిక విశ్లేషించింది. ట్రాఫిక్‌ ఉల్లంఘనల వల్లే రోజుకు తొమ్మిది మంది ప్రమాదాల బారిన పడి మృత్యువాత పడుతున్నారని నివేదికలో పేర్కొంది. ప్రతి వంద రోడ్డు ప్రమాదాల్లో 36మంది దుర్మరణం పాలవుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ర్ట ప్రభుత్వం చలానాలను భారీగా పెంచినట్లు సమర్ధించుకుంది.


Next Story

Most Viewed