చిన్ని నివేద.. పెద్ద థ్యాంక్స్

by  |
చిన్ని నివేద.. పెద్ద థ్యాంక్స్
X

చిన్ని నివేదా థామస్.. పెద్ద థ్యాంక్స్ చెబుతోందని లేటెస్ట్‌గా పోస్ట్ పెట్టింది హీరోయిన్ నివేద. తను తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా.. తనను ఆదరించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతూ చిన్నప్పటి ఫోటో షేర్ చేస్తూ థాంక్స్ నోట్ పెట్టింది.

‘జూన్ 17.. సరిగ్గా నాలుగేళ్ల కిందట కొత్త ఇండస్ట్రీకి పరిచయమయ్యా.. కొత్త భాష నేర్చుకున్నా.. కొత్త కొత్త మనుషులను కలుసుకున్నా.. కొత్త స్కి్వల్స్ నేర్చుకోవడం ప్రారంభించా.. సినిమాలు, కథలు, చర్చలు, ఆలోచనలు, డైలాగ్స్, క్యారెక్టర్స్, నాలెడ్జ్, స్క్రిప్ట్స్.. ఇప్పుడు నా లైఫ్‌లో భాగమైపోయాయి. నాకు ఈ ప్రపంచం చాలా నచ్చింది..’ అంటూ బిగ్ అండ్ టైట్ హగ్ ఇచ్చింది. మరింత కాలం ఇదే ఇండస్ట్రీలో పని చేయాలని.. మరిన్ని పాత్రల్లో జీవించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ‘సినిమా నాకు అన్నీ ఇచ్చింది.. కావున నేను ఎప్పటికీ ఇందులో ఒక విద్యార్థిగా ఉండాలి అనుకుంటున్నా.. చూడాల్సింది చాలా ఉంది.. చేయాల్సింది ఇంకా ఉంది..’ అని తెలిపిన నివేదా థామస్.. తనపై ఇంత అభిమానం చూపిస్తున్న ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

https://www.instagram.com/p/CBh_lRLgsm0/?igshid=jn8rd2raxa6o

కాగా, నానితో జెంటిల్‌మన్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నివేద.. ‘నిన్నుకోరి, జై లవ కుశ, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, 118, బ్రోచేవారెవరురా, దర్బార్’ చిత్రాలతో తెలుగు ప్రజల ఫేవరెట్ స్టార్‌గా మారిపోయింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్‌లో కీలక పాత్రలో కనిపించనుంది నివేద.


Next Story