- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాపై మరో బాంబ్ పేల్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్
<p>దిశ,వెబ్‌డెస్క్: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరో బాంబ్ పేల్చింది. కరోనా కొత్త వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే..ఇప్పటి వరకు కరోనాలోని 4 రకాల వైరస్‌లను గుర్తించినట్లు WHO తెలిపింది. 2019, నవంబర్‌లో తొలిసారి చైనాలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి ఇప్పటి వరకు కరోనా వైరస్‌లో మొత్తం 4 రకాల వైరస్‌లు ప్రపంచం అంతటా వ్యాపించినట్లు WHO తన నివేదికలో తెలిపింది. గత ఏడాది జనవరిలో డీ614జీ జన్యు మార్పు కలిగిన ఓ […]</p>

దిశ,వెబ్‌డెస్క్: వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరో బాంబ్ పేల్చింది. కరోనా కొత్త వైరస్ తో ప్రపంచ దేశాలు వణికిపోతుంటే..ఇప్పటి వరకు కరోనాలోని 4 రకాల వైరస్‌లను గుర్తించినట్లు WHO తెలిపింది.
2019, నవంబర్‌లో తొలిసారి చైనాలో కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది. నాటి నుంచి ఇప్పటి వరకు కరోనా వైరస్‌లో మొత్తం 4 రకాల వైరస్‌లు ప్రపంచం అంతటా వ్యాపించినట్లు WHO తన నివేదికలో తెలిపింది. గత ఏడాది జనవరిలో డీ614జీ జన్యు మార్పు కలిగిన ఓ కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి రాగా .. జూన్ 2020 నాటికి అత్యధిక శాతం కేసులు నమోదు కావడానికి కారణమైంది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో మూడో స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చింది. డెన్మార్క్‌లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈస్ట్రెయిన్‌కు సైంటిస్ట్‌లు క్లస్టర్-5గా నామకరణం చేశారు.
ఇక తాజాగా 2020, డిసెంబర్ నెలలో బ్రిటన్ మరో కరోనా స్ట్రెయిన్‌ను గుర్తించినట్లు డబ్ల్యూహెచ్ ఓ తెలిపింది. కరోనా వైరస్‌తో ఈ కొత్త స్ట్రెయిన్‌కు ఫైలోజెనెటిక్ సంబంధం లేదని సైంటిస్ట్ లు గుర్తించారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా అందిన నివేదికల ఆధారంగానే WHO 4 వైరస్‌లు ఉన్నట్లు నిర్ధారించినట్లు సమాచారం.






