- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మానకొండూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే నలుగురు దుర్మరణం
<p>దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జ్యోతినగర్‌కు చెందిన నివాసులు ఖమ్మం జిల్లా కల్లూరులో జరిగిన దశదిన కర్మకు హాజరై తిరిగి వస్తుండగా.. శుక్రవారం తెల్లవారు జామున మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో కారు చెట్టుకు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోవడంతో మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. చనిపోయిన వారిని డ్రైవర్ హిందూరి జలంధర్, […]</p>

దిశ, మానకొండూరు: కరీంనగర్ జిల్లా మానకొండూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జ్యోతినగర్‌కు చెందిన నివాసులు ఖమ్మం జిల్లా కల్లూరులో జరిగిన దశదిన కర్మకు హాజరై తిరిగి వస్తుండగా.. శుక్రవారం తెల్లవారు జామున మానకొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలో కారు చెట్టుకు ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ నిద్రమత్తులో ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే చనిపోవడంతో మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. చనిపోయిన వారిని డ్రైవర్ హిందూరి జలంధర్, కొప్పుల బాలాజీ శ్రీధర్, కొప్పుల శ్రీనివాస రావు, శ్రీరాజ్‌లుగా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన పెంచాల సుధాకర్ రావును కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో సిరిసిల్ల పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాసరావు, పెద్దపల్లిలో అడ్వకేట్‌గా పనిచేస్తున్న కొప్పుల బాలాజీ శ్రీధర్‌లుగా గుర్తించారు. వీరిద్దరు అన్నదమ్ములు కావడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.






