- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్తులో ట్రాఫిక్ పోలీసులపై కత్తులతో దాడి
by Sridhar Babu |
<p>దిశ, వెబ్ డెస్క్: కొత్తగూడెంలో గంజాయి మత్తులో నలుగురు యువకులు వీరంగం చేశారు. ఎం.జి రోడ్డులో పండ్లు అమ్ముకునే నలుగురు యువకులు గంజాయి సేవించారు. పండ్లు కొనేందుకు వెళ్లిన వివాహితతో దురుసుగా ప్రవర్తించారు. అడ్డొచ్చిన ఆమె భర్తపై కత్తి కర్రలతో దాడికి పాల్పడ్డారు. భయంతో పరుగులెత్తిన అతనిని వెంబడించి మరీ దాడి చేశారు. ప్రాణ భయంతో అతను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో దూరగా స్టేషన్ తలుపులు నెట్టుకుని మరీ లోపలికెళ్ళి నానా హంగామా చేసారు. ట్రాఫిక్ పోలీసులను సైతం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: కొత్తగూడెంలో గంజాయి మత్తులో నలుగురు యువకులు వీరంగం చేశారు. ఎం.జి రోడ్డులో పండ్లు అమ్ముకునే నలుగురు యువకులు గంజాయి సేవించారు. పండ్లు కొనేందుకు వెళ్లిన వివాహితతో దురుసుగా ప్రవర్తించారు. అడ్డొచ్చిన ఆమె భర్తపై కత్తి కర్రలతో దాడికి పాల్పడ్డారు. భయంతో పరుగులెత్తిన అతనిని వెంబడించి మరీ దాడి చేశారు.
ప్రాణ భయంతో అతను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో దూరగా స్టేషన్ తలుపులు నెట్టుకుని మరీ లోపలికెళ్ళి నానా హంగామా చేసారు. ట్రాఫిక్ పోలీసులను సైతం వదలలేదు. వారిపైనా కత్తులతో, కర్రలతో దాడి చేసారు. వీరి కారణంగా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న త్రీటౌన్ సిఐ ఆదినారాయణ సిబ్బందితో అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. యువకులపై కేసు నమోదు చేసుకుని అదుపులోకి తీసుకున్నారు.
Next Story






