చిన్న పిల్లలని చూడకుండా..

25

దిశ, వెబ్‌డెస్క్: కన్నవాళ్లు పొట్టకూటి కోసం కష్టానికి పోతే కన్నబిడ్డలను కనికరం లేకుండా నరికేశారు కొంతమంది దుండగులు. అభం శుభం తెలియని పసిబిడ్డలను బలిపశువులను చేసి చంపేశారు. గొడ్డలి పెట్టుకు ఆ చిన్నారులు ఎంతటి నరకాన్ని చూస్తూ ప్రాణాలు విడిచారో తలుచుకుంటానే గుండె తరుక్కుపోతోంది.

మధ్యప్రదేశ్‌కు చెందిన మెహతాబ్-రుమాలలి భీలాలా దంపతులు పనికోసం మహారాష్ట్రకు వలసొచ్చారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే, జల్గావ్ ఏరియాలో ముస్తాఫా అనే వ్యక్తి వద్ద పొలం పనికెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం ఇంటి నుంచి బయటకెళ్లిన తల్లిదండ్రులు పిల్లలు సైతా (12), రావల్ (11), అనిల్ (8), సుమన్ (3) ఇంట్లోనే వదిలేసి వెళ్లారు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడ్డ పలువురు నలుగురు పిల్లల్ని గొడ్డలితో నరికి చంపారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బిడ్డల మృతదేహాల వద్ద కుప్పకూలిపోయి.. బోరున విలపించారు.