రాష్ట్రానికి చేరిన 4.6లక్షల వ్యాక్సిన్ డోసులు

by  |
రాష్ట్రానికి చేరిన 4.6లక్షల వ్యాక్సిన్ డోసులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి 4.6లక్షల డోసుల వ్యాక్సిన్ ను కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసింది. వీటిలో 2లక్షల డోసులు కోవ్యాక్సిన్ ఉండగా 2.6లక్షలు కోవిషీల్డ్ వ్యాక్సిన్‌లు ఉన్నాయి. సీఎస్ సోమేష్ కుమార్ లేఖకు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు వ్యాక్సిన్లను అందించింది. నేటి నుంచి అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో రోజుకు 1,30,531 మందికి కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తుండటంతో ప్రస్తుతం దిగుమతైన వ్యాక్సిన్లు 3 రోజుల వరకు సరిపడనున్నాయి. వ్యాక్సిన్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగానే ఏర్పాట్లను చేస్తుంది. వ్యాక్సిన్ పంపిణీ మొదట్లో ఏప్రిల్ 3న మొదటి, రెండో డోసులు కలిపి 54,404 మందికి అందించారు.

ప్రజల్లో వ్యాక్సిన్ పట్ల అవగాహన పెరిగి వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు వస్తుండటంతో ప్రస్తుతం రోజుకు 1,30,531 మంది వరకు వ్యాక్సిన్ ను అందిస్తున్నారు, ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం మొదటి విడుత డోసును 19,79,534 మందికి రెండవ విడుత డోసును 3,09,834 మందికి అందించారు. వీరిలో హెల్త్ కేర్ వర్కర్లకు మొదటి విడుత డోసును 2,30,890 మందికి, రెండ విడుత డోసును 1,73,735 మందికి అందించారు. ఫ్రంట్ లైన్ వర్కర్లకు మొదటి విడుతడోసును 1,76,271మందికి, రెండవ విడుత డోసును 71,578 మందికి అందించారు. 45ఏళ్లు పైబడిన వారికి మొదటి విడుత డోసును 15,72,373 మందికి రెండవ విడుత డోసును 65,521 మందికి అందించారు.


Next Story