దెందులూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

by Vemula.Srinu Prasad |

<p>దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు సమీపంలో గల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును కారు వేగంగా వచ్చి ఢీ కొనడంతో అందులోని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో డివైడర్ దాటే సమయంలో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ [&hellip;]</p>

దెందులూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు సమీపంలో గల జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును కారు వేగంగా వచ్చి ఢీ కొనడంతో అందులోని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో డివైడర్ దాటే సమయంలో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story