ఉమ్మడి నిజామాబాద్‌లో ఇవాళ 33 పాజిటివ్ కేసులు

by Shyam |

<p>దిశ, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజగా గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లాలో 33 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో కామారెడ్డి జిల్లాలో తొలిసారి 26 పాజిటివ్ కేసులు వచ్చాయి. 127 షాంపిళ్లను పరీక్షలకు పంపగా 26 పాజిటివ్ రాగా, 101 నెగిటివ్ వచ్చాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 14, చిన్నమల్లారెడ్డి 1, బాన్సువాడ 5, పిట్లం 1, దోమకొండ 1, పోచారం 1, గాందారీ 2, [&hellip;]</p>

ఉమ్మడి నిజామాబాద్‌లో ఇవాళ 33 పాజిటివ్ కేసులు
X

దిశ, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజగా గడిచిన 24 గంటల్లో ఉమ్మడి జిల్లాలో 33 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇందులో కామారెడ్డి జిల్లాలో తొలిసారి 26 పాజిటివ్ కేసులు వచ్చాయి. 127 షాంపిళ్లను పరీక్షలకు పంపగా 26 పాజిటివ్ రాగా, 101 నెగిటివ్ వచ్చాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో 14, చిన్నమల్లారెడ్డి 1, బాన్సువాడ 5, పిట్లం 1, దోమకొండ 1, పోచారం 1, గాందారీ 2, మాచారెడ్డి 1 పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యాధికారులు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 129 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇంకా 138 నమునాల ఫలితాలు రావాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లాలో శుక్రవారం నలుగురు కరోనా పాజిటివ్‌తో చనిపోగా, 7 పాజిటివ్ కేసులు వచ్చాయి. జిల్లాలో మొత్తం 205 పాజిటివ్ కేసులు అయ్యాయి.

Next Story