వింత వైరస్..30వేల కోళ్లు మృతి

by Sridhar Babu |

<p>దిశ,వెబ్‌డెస్క్: వింత వైరస్ సోకడంతో 30వేల ఫారం కోళ్లు మృతి చెందాయి.ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం, బయ్యన్నగూడలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.అయితే చనిపోయిన ఫారం కోళ్లను పౌల్ట్రీ యాజమానులు గొయ్యి తీసి అందులో పడవేస్తున్నారు కానీ, పూడ్చిపెట్టడం లేదు. ఇలా చేయడం వలన గుర్తుతెలియని వైరస్ మనుషులకు సోకితే ఇబ్బందులు తలెత్తుతాయని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.అయితే పెద్ద ఎత్తున కోళ్లు చనిపోవడంతో తమకు నష్టం వాటిల్లుతోందని పౌల్ట్రీ యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ [&hellip;]</p>

వింత వైరస్..30వేల కోళ్లు మృతి
X

దిశ,వెబ్‌డెస్క్: వింత వైరస్ సోకడంతో 30వేల ఫారం కోళ్లు మృతి చెందాయి.ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం, బయ్యన్నగూడలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.అయితే చనిపోయిన ఫారం కోళ్లను పౌల్ట్రీ యాజమానులు గొయ్యి తీసి అందులో పడవేస్తున్నారు కానీ, పూడ్చిపెట్టడం లేదు. ఇలా చేయడం వలన గుర్తుతెలియని వైరస్ మనుషులకు సోకితే ఇబ్బందులు తలెత్తుతాయని స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.అయితే పెద్ద ఎత్తున కోళ్లు చనిపోవడంతో తమకు నష్టం వాటిల్లుతోందని పౌల్ట్రీ యాజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ గూర్చి అధికారులు ఇప్పటికే ఆరా తీస్తున్నారు. కోవిడ్-19దెబ్బకు ఇప్పటికే చికెన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టడంతో అంతుచిక్కిన వైరస్ వలన పౌల్ట్రీ ఇండస్ట్రీ దెబ్బతినే పరిస్థితి నెలకొందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story