మీ ఆదరణే ఇక్కడ నిలబెట్టింది: ప్రదీప్ మాచిరాజు

by  |
మీ ఆదరణే ఇక్కడ నిలబెట్టింది: ప్రదీప్ మాచిరాజు
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా వస్తున్న ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమా ప్రమోషన్స్ వినూత్నంగా జరుగుతున్నాయి. జబర్దస్త్, ఢీ టీంతో కలిసి ప్రదీప్ ఓ ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేయగా ఆడియన్స్‌కు చక్కగా రీచ్ అయింది. ఈ నెల 29న సినిమా విడుదల కాబోతుండగా..ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించింది మూవీ యూనిట్. హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు అనిల్ రావిపూడి, మారుతి, హీరోలు కార్తికేయ, అడవి శేషు, నిర్మాత సి. కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అతిథులు..‘నీలి నీలి ఆకాశం’ పాట ఎంత హిట్ అయిందో సినిమా కూడా అంతే బిగ్ హిట్ కావాలని కోరుకున్నారు. ప్రదీప్ చాలా కష్టపడి ఈ స్థాయికి ఎదిగాడని.. సినిమాల్లో బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇన్నాళ్లు బుల్లితెరపై ఎంటర్టైన్ చేసిన ప్రదీప్‌ ఇకపై బిగ్ స్క్రీన్‌పై అలరించేందుకు వస్తున్నారని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా అమేజింగ్ ఆల్బమ్ అందించిన అనూప్ రూబెన్స్‌ను అభినందించిన గెస్ట్‌లు.. ఎప్పుడు కలిసిన డిఫరెంట్ స్టోరీస్, కాన్సెప్ట్‌లు చెప్తూ ఇన్‌స్పైర్ చేసే డైరెక్టర్ మున్నా తప్పకుండా ఈ సినిమా ద్వారా సక్సెస్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. నిర్మాత ఎస్వీ బాబుకు భారీగా లాభాలు లావాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రదీప్.. తనను బ్రదర్‌లా ఆదరించిన దర్శక, నిర్మాతలకు థాంక్స్ చెప్పాడు. చిన్న సినిమా అయిన పెద్ద బడ్జెట్‌లో చాలా రిచ్‌గా తీశారని.. అనూప్ రూబెన్స్ మ్యూజిక్ సినిమాకు మెయిన్ పిల్లర్ అని కొనియాడారు. శివేంద్ర అంతే అందంగా ఫ్రేమ్ అమర్చారని..సూపర్బ్ లిరిక్స్ అందించిన చంద్రబోస్, అనంత శ్రీరామ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.


Next Story