- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
30 శాతం పోలీసులకు వ్యాక్సిన్ పూర్తి
by Shyam |
<p>దిశ, క్రైమ్ బ్యూరో : ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో 30 శాతం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం పూర్తయినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. పేట్లబురుజు కేంద్రంలో నగర సీపీ అంజనీకుమార్ సోమవారం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తంగా పోలీసులు 30 వేల మంది వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకోగా, అందులో 30 శాతం పూర్తయిందన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావొద్దన్నారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 8 […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో : ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో 30 శాతం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం పూర్తయినట్టు సీపీ అంజనీకుమార్ తెలిపారు. పేట్లబురుజు కేంద్రంలో నగర సీపీ అంజనీకుమార్ సోమవారం కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తంగా పోలీసులు 30 వేల మంది వ్యాక్సిన్ కోసం నమోదు చేసుకోగా, అందులో 30 శాతం పూర్తయిందన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావొద్దన్నారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 8 వేల మందికి వ్యాక్సిన్ నిమిత్తం పేర్లు నమోదు చేసుకోగా, ఇప్పటి వరకూ 3789 మంది పోలీసులు వ్యాక్సిన్ తీసుకున్నారని హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటి తెలిపారు.
Next Story






