- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుప్పలు తెప్పలుగా కోతుల మృతదేహాలు.. విషమిచ్చి, చితకబాది..!
by Batti.Sumithra |
<p>హసన్ : కర్ణాటకలోని హసన్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విషప్రయోగం చేసి గోనె సంచుల్లో కుక్కి బాది కోతులను చంపిన ఘటన కలకలం రేపింది. బేలూరు తాలూకా, చౌదనహల్లి గ్రామ పరిసరాల్లో ఓ రోడ్డు పక్కన అనుమానాస్పదంగా గోనె సంచులు కనిపించాయి. కొందరు యువకులు వాటిని విప్పగా అందులో కోతుల మృతదేహాలు బయటపడ్డాయి. వానరాలకు విషమిచ్చి సంచిలో కుక్కి వాటిని బాదినట్టు తెలుస్తున్నదని, ఇందులో 30 కోతులు మృతి చెందగా మరో 20 గాయపడ్డాయని […]</p>

X
హసన్ : కర్ణాటకలోని హసన్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విషప్రయోగం చేసి గోనె సంచుల్లో కుక్కి బాది కోతులను చంపిన ఘటన కలకలం రేపింది. బేలూరు తాలూకా, చౌదనహల్లి గ్రామ పరిసరాల్లో ఓ రోడ్డు పక్కన అనుమానాస్పదంగా గోనె సంచులు కనిపించాయి. కొందరు యువకులు వాటిని విప్పగా అందులో కోతుల మృతదేహాలు బయటపడ్డాయి.
వానరాలకు విషమిచ్చి సంచిలో కుక్కి వాటిని బాదినట్టు తెలుస్తున్నదని, ఇందులో 30 కోతులు మృతి చెందగా మరో 20 గాయపడ్డాయని అధికారులు వివరించారు. గాయపడ్డ 20 కోతుల్లో 18 వానరాలు సంచిలో నుంచి బయటికొచ్చాక శ్వాస పీల్చుకుని కొన్ని నీళ్లు తాగి అడవుల్లోకి వెళ్లిపోయాయి. మరో రెండు కోతులకు చికిత్స ఇస్తున్నారు.
Next Story






