తమతోపాటు అశ్లీల వీడియోలు చూడటంలేదని.. బాలికను చంపేసిన ముగ్గురు బాలురు

by  |
Forn-Videos1
X

దిశ, వెబ్ డెస్క్: అస్సాంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమతోపాటు ఫోర్న్ వీడియోస్ చూడటంలేదని ఓ బాలికను ముగ్గురు మైనర్లు అతిదారుణంగా హత్య చేశారు. వారితోపాటు, ఈ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించిన నిందితుల్లో ఒకరి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే.. నాగావ్ జిల్లాలోని కలియాబోర్ సమీపంలో ముగ్గురు బాలురు నివసించేవారు. అయితే, కొద్దిరోజుల నుంచి వారంతా ఒక చోట చేరి మొబైల్ లో ఫోర్న్ వీడియోస్ చూస్తుండేవారు. ఇలా వారు ఫోర్న్ వీడియోస్ కు బానిసయ్యారు. ఇటీవల ఆ ముగ్గురు తమకు సమీపంలో నివసించే ఏడేళ్ల బాలికను అక్కడికి తీసుకెళ్లారు. అనంతరం వారు తమతోపాటు అశ్లీల వీడియోలు చూడాలని ఆ బాలికను బలవంతం చేశారు. వీడియోలు చూసేందుకు ఆ బాలిక నిరాకరించింది. దీంతో వారు ఆ బాలికను రాళ్లతో కొట్టి చంపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులను 24 గంటల్లోనే అరెస్ట్ చేశారు. ఈ నేరాన్ని దాచేందుకు ప్రయత్నించిన నిందితుల్లో ఒకరి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story