ఫ్లాష్ ఫ్లాష్.. ఒకే ఇంట్లో ముగ్గురు మైనర్లు కిడ్నాప్..!

by  |
ఫ్లాష్ ఫ్లాష్.. ఒకే ఇంట్లో ముగ్గురు మైనర్లు కిడ్నాప్..!
X

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహా నగరంలోని వనస్థలిపురంలో దారుణం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మైనర్లు కనిపించకుండా పోయారు. ఐశ్వర్య బెక్, అస్మాబెక్, అబీర్ బెక్ కనిపించకుండా పోవడం స్థానికంగా కలకలం రేపింది. అయితే, శుక్రవారం సాయంత తమ ముగ్గురు పిల్లలను అగంతకులు ఎత్తుకెళ్లినట్లు చెబుతున్నారు. రమేష్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసినట్లు బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

అంతకుముందు రమేష్ అనే వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ తన కూతురు ఐశ్వర్య బెక్ వెంటపడేవాడని పేరెంట్స్ వెల్లడిండిచారు. ఈ విషయంలో అతన్ని పలుమార్లు హెచ్చరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో బాలికల పేరెంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.Next Story