- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మురికివాడలో నివసించే ముగ్గురమ్మాయిల డ్యాన్స్ వీడియో వైరల్.. ఫిదా అవుతున్న బాలీవుడ్ స్టార్స్
<p>దిశ, వెబ్ డెస్క్: దేశంలో ప్రతిభకు కొరత లేదని ఈ వీడియో మళ్లీ రుజువు చేసింది. సోషల్ మీడియాను ప్లాట్‌ఫామ్‌గా చేసుకొని సత్యమేవ జయతే-2లోని కుసు కుసుకు పాటకు డ్యాన్స్ చేసిన ముగ్గురు అమ్మాయిల వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మురికివాడలో నివసించే ముగ్గురు అమ్మాయిలు అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌ని ఒక్క బీట్ కూడా మిస్ కాకుండా పర్ఫెక్ట్ స్టెప్పులతో చేశారు. వీరికి డ్యాన్స్ పట్ల ఉన్న అభిమానం, ఉత్సాహం ఏంటో దీని ద్వారా […]</p>

దిశ, వెబ్ డెస్క్: దేశంలో ప్రతిభకు కొరత లేదని ఈ వీడియో మళ్లీ రుజువు చేసింది. సోషల్ మీడియాను ప్లాట్‌ఫామ్‌గా చేసుకొని సత్యమేవ జయతే-2లోని కుసు కుసుకు పాటకు డ్యాన్స్ చేసిన ముగ్గురు అమ్మాయిల వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మురికివాడలో నివసించే ముగ్గురు అమ్మాయిలు అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌ని ఒక్క బీట్ కూడా మిస్ కాకుండా పర్ఫెక్ట్ స్టెప్పులతో చేశారు. వీరికి డ్యాన్స్ పట్ల ఉన్న అభిమానం, ఉత్సాహం ఏంటో దీని ద్వారా తెలుస్తోంది.
ఇలా ఆ వీడియో వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చకర్లు కొడుతూ ఆ వీడియో అసలు పాటలో నటించిన నటి నోరా ఫతేహి కంట పడింది. ఈ వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి “ఓ మైగాడ్ ఇది చాలా బాగుంది! మీరు ఒక అద్భుతం గాయిస్..!” క్యాప్షన్ పెట్టింది. వీరి పెర్ఫార్మెన్స్ చూసిన వారందరు వావ్ సూపర్ అని, ఇలాంటి వారికి అవకాశం ఇవ్వాలని కామెంట్ రూపంలో పెడుతున్నారు. ఈ వీడియోను ఇప్పటివరకు 7.4 లక్షల మందికి పైగా లైక్ చేయగా, 4000 మంది దీనిపై కామెంట్ చేశారు.
https://www.instagram.com/reel/CWIfmQdAzYq/?utm_source=ig_web_copy_link






