- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మూడు ప్రాణాలు తీసిన తీగ
<p>దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి తాత, మనవరాలు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, ఓ మూగజీవి కూడా మృత్యువాత పడింది. ఈ ఘటన జిల్లాలోని కోరుట్ల పట్టణంలో గురువారం తెల్లవారు జామున వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కోరుట్ల మునిసిపాలిటీలో విలీన గ్రామమైన యేఖిన్ పూర్‌లో రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అది గమనించకుండా తెల్లవారు జామున బయటకు వచ్చిన అందుగుల మల్లయ్య (65) అందుగుల మౌనిక (17)లకు […]</p>

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి తాత, మనవరాలు అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా, ఓ మూగజీవి కూడా మృత్యువాత పడింది. ఈ ఘటన జిల్లాలోని కోరుట్ల పట్టణంలో గురువారం తెల్లవారు జామున వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కోరుట్ల మునిసిపాలిటీలో విలీన గ్రామమైన యేఖిన్ పూర్‌లో రాత్రి కురిసిన వర్షానికి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అది గమనించకుండా తెల్లవారు జామున బయటకు వచ్చిన అందుగుల మల్లయ్య (65) అందుగుల మౌనిక (17)లకు విద్యుత్ తీగ తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. సరిగ్గా మృతుల ఇంటి ఎదుటే 11 కెవీ లైన్ విద్యుత్ తీగలు తెగిపడి కనిపించాయి. వీరితో పాటే కరెంట్ షాక్‌తో ఓ మూగజీవి కూడా చనిపోయింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా, ఒకే కుటుంబంలో ఇద్దరు మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.






