- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Crime news: ఘోరాతి ఘోరం.. బాలికపై 29 మంది గ్యాంగ్ రేప్.. వీడియోలు తీసి…
<p>దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చిన్నా.. పెద్దా.. ముసలి.. ముతకా అన్న తేడా లేకుండా మీద పడి మృగాల్లా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీరికి వయసుతో సంబంధంలేదని సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో జరిగిన ఘటన చూస్తే అర్ధమవుతుంది. అయితే, తాజాగా.. మహారాష్ట్రలోని ఠాణెలో అత్యంత క్రూరమైన అత్యాచార ఘటన జరిగింది. అబం శుభం తెలియని 15 ఏళ్ల బాలికని 29 మంది అత్యాచారం చేశారు. ఆ ప్రాంతానికే […]</p>

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చిన్నా.. పెద్దా.. ముసలి.. ముతకా అన్న తేడా లేకుండా మీద పడి మృగాల్లా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీరికి వయసుతో సంబంధంలేదని సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో జరిగిన ఘటన చూస్తే అర్ధమవుతుంది. అయితే, తాజాగా.. మహారాష్ట్రలోని ఠాణెలో అత్యంత క్రూరమైన అత్యాచార ఘటన జరిగింది. అబం శుభం తెలియని 15 ఏళ్ల బాలికని 29 మంది అత్యాచారం చేశారు.
ఆ ప్రాంతానికే చెందిన ఓ యువకుడు సంబంధిత బాలికను అసభ్యకరంగా వీడియోలు తీశాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని 29 మంది ఈ దారుణానికి పాల్పడ్డారు. సామూహిక అత్యాచారం ఘటనపై కేసు నమోదు చేసిన ఠాణె పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి 26 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురి నిందితుల కోసం గాలిస్తున్నారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు మహారాష్ట్ర పోలీసులు వెల్లడించారు.






