ఆముదం గింజలు తిని 25 మంది విద్యార్థులకు అస్వస్థత

by  |
25 students Illness
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లా వెంకటగిరికోట మండలం కంబార్లపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అడవి ఆముదాల గింజలు తిని 25 మంది విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల అనంతరం ఆటలాడుతూ గ్రామ సమీపంలోకి వెళ్లి అడవి ఆముదాల గింజలు తిన్నారు. సాయంత్రం ఇంటికొచ్చాక వాంతులు, విరోచనాలు కావడంతో ఆముదాల గింజలు తిన్న 25 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెంది వెంకటగిరికోట మండల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పలువురి విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed