కోదండపురంలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా

229
road accident

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కోదండపురంలోని 44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుండి ఆదోనికి 50 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆదోని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదం శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. విషయం తెలిసిన వెంటనే కోదండపురం ఎస్ఐ వెంకటస్వామి ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. బాధితులను సమీపంలో ఉన్న కర్నూలు జిల్లా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డట్లు ఎస్ఐ వెంకటస్వామి తెలిపారు. 25 ప్రయాణికులకు ప్రాణాపాయం తప్పిందని ఆయన పేర్కొన్నారు. డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..