- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాటుసారా తాగి 25 మందికి అస్వస్థత
by Vemula.Srinu Prasad |
<p>దిశ,విశాఖపట్నం : శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడిలో నాటుసారా కలకలం రేపింది. నాటుసారాను తాగి 25 మంది అస్వస్థతకు గురయిన ఘటన శనివారం అర్థరాత్రి శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడిలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారందరినీ వెంటనే హరిపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రక్తపు వాంతులు అవడంతో మెరుగైన వైద్యం కోసం వాళ్లిద్దరినీ శ్రీకాకుళం జీజీహెచ్ కు తరలించారు. మిగతా 23 మంది స్థానిక […]</p>

X
దిశ,విశాఖపట్నం : శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడిలో నాటుసారా కలకలం రేపింది. నాటుసారాను తాగి 25 మంది అస్వస్థతకు గురయిన ఘటన శనివారం అర్థరాత్రి శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం సిరిమామిడిలో చోటు చేసుకుంది. అస్వస్థతకు గురైన వారందరినీ వెంటనే హరిపురం సామాజిక ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. రక్తపు వాంతులు అవడంతో మెరుగైన వైద్యం కోసం వాళ్లిద్దరినీ శ్రీకాకుళం జీజీహెచ్ కు తరలించారు. మిగతా 23 మంది స్థానిక వైద్యుడి వద్ద చికిత్స పొంది ఇళ్లకు చేరుకున్నారు. ఒడిశా నుండి తీసుకొచ్చిన నాటు సారాను తాగడం వల్లే వీళ్లు అస్వస్థతకు గురయినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Next Story






