- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కర్ణాటకలో 24/7 దుకాణాలు.. కండిషన్స్ అప్లై!
<p>దిశ, వెబ్‌డెస్క్ : దుకాణాలు, వాణిజ్య సముదాయాల్లో 10 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు పనిచేసే సముదాయాలు 24/7 నడిపించుకోవచ్చునని కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది మూడేళ్ల వరకు అమలులో ఉంటుందని శనివారం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వలన ఇన్నిరోజులు వాణిజ్య సముదాయాలు నష్టాల్లో కూరుకుపోయాయి. దీంతో కర్టాటక రెవెన్యూ కూడా భారీగా పడిపోయింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని వ్యాపార సముదాయాలు 24/7 తెరిచి ఉంచేందుకు బీజేపీ ప్రభుత్వం పచ్చ జెండా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దుకాణాలు, వాణిజ్య సముదాయాల్లో 10 లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు పనిచేసే సముదాయాలు 24/7 నడిపించుకోవచ్చునని కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది మూడేళ్ల వరకు అమలులో ఉంటుందని శనివారం ప్రకటించింది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వలన ఇన్నిరోజులు వాణిజ్య సముదాయాలు నష్టాల్లో కూరుకుపోయాయి.
దీంతో కర్టాటక రెవెన్యూ కూడా భారీగా పడిపోయింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని వ్యాపార సముదాయాలు 24/7 తెరిచి ఉంచేందుకు బీజేపీ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఉద్యోగులు కూడా 8గంటల నుంచి 10గంటల వరకు పని చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నిర్ణయం రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం స్పష్టంచేసింది.
Next Story






