ICC World Cup 2023: తెలుగులో మాట్లాడిన నెదర్లాండ్స్‌ ప్లేయర్.. వీడియో వైరల్

by Vinod kumar |   (  Updated:2023-10-13 08:19:50  IST  )

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం హైద‌రాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నెదర్లాండ్స్‌ vs పాకిస్థాన్‌ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

ICC World Cup 2023: తెలుగులో మాట్లాడిన నెదర్లాండ్స్‌ ప్లేయర్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం హైద‌రాబాద్‌ ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నెదర్లాండ్స్‌ vs పాకిస్థాన్‌ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే నెదర్లాండ్స్‌ జట్టులో తెలుగు మూలాలున్న విజయవాడ వాసి తేజా నిడమనూర్‌ కు చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సంద‌ర్భంగా నెదర్లాండ్స్ టీమ్‌లో ఉన్న తేజ మాట్లాడుతూ.. నెదర్లాండ్స్‌కు మద్దతు ఇవ్వాలని సోష‌ల్ మీడియాలో కోరాడు. ''హైదరాబాద్ మీకు ఆరెంజ్ అంటే చాలా ఇష్టం. మేము ఇవాళ పాక్‌తో ఉప్పల్‌లో మ్యాచ్ ఆడుతున్నాం. మీరు గ్రౌండ్‌కు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే మేము సంతోష పడతాం'' అని తేజ తెలుగులో అభిమానులను కోరారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

Next Story