- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- ఆరోగ్యం
- స్పోర్ట్స్
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫోటోలు
- జిల్లా వార్తలు
- భక్తి
ఈ సంసారమే ఓ తక్కెడ?
అంరెండుదులో రెండు వైపులా
ఓ సరసం,
ఓ సరదా,
ఓ సంతోషం
ఓ మంచితనం,
ఓ మానవత్వం
ఓ సహనం,
ఓ సమానత్వం,
ఓ సర్దుబాటుగుణం
ఓ సమయస్ఫూర్తి నిండిన
నిర్మలమైన నిశ్చలమైన
నమ్మకమైన పవిత్రమైన
పాలలా స్వచ్చమైన
ఓ రెండు వందల
గ్రాముల “ప్రేమే” ఉంటే
ఇక ఆ భార్యాభర్తల మధ్య
ఎక్కువ తక్కువ తేడాలెక్కడ ?
అట్టివారి సంసారం
ఓ మధురమైన
ఓ మంగళకరమైన
ఓ మనోహరమైన
ఓ సుమధురమైన
ఓ శుభకరమైన
ఓ సుందరమైన
ఓ నందన వనమే
ఓ ఆనంద సాగరమే
అందులో ఆవగింజంతైనా
సందేహం లేదు…లేదు…
ఇది ముమ్మాటికి నిజం…
రచన : పోలయ్య కవి, కూకట్లపల్లి
Cell.No.9110784502
Email. kpl9711@gmail.com
Address.Attapur. Hyderabad.48
Next Story