ఘోర ప్రమాదం.. 20మంది కూలీలకు గాయాలు

88
road accident

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లా వినుకొండ మండలం అందుగలకొత్తపాలెం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న టాటాఎస్ వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. దాదాపు 20మందికిపైగా తీవ్రగాయలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అనంతరం సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు. కూలీలందరూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వాసులుగా గుర్తించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..