- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా రోగిని చితకబాదిన పోలీసులు.. వీడియో వైరల్
<p>దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మానవత్వం మరిచి ఇద్దరు పోలీసులు కరోనా రోగిని చితకబాదారు. ఈ విషయం కాస్తా పోలీస్ ఉన్నతాధికారులకు తెలియడంతో వారిని సస్పెండ్ చేశారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో నిన్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. ఆస్పత్రికి తరలించేందుకు ఆరోగ్య సిబ్బంది అతని వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో హెల్త్ వర్కర్స్‌పై రోగి కుటుంబ సభ్యులు దాడి చేశారు. దాడి అనంతరం, హెల్త్ వర్కర్స్ […]</p>

దిశ, వెబ్ డెస్క్ : మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మానవత్వం మరిచి ఇద్దరు పోలీసులు కరోనా రోగిని చితకబాదారు. ఈ విషయం కాస్తా పోలీస్ ఉన్నతాధికారులకు తెలియడంతో వారిని సస్పెండ్ చేశారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో నిన్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో.. ఆస్పత్రికి తరలించేందుకు ఆరోగ్య సిబ్బంది అతని వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో హెల్త్ వర్కర్స్‌పై రోగి కుటుంబ సభ్యులు దాడి చేశారు. దాడి అనంతరం, హెల్త్ వర్కర్స్ పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కరోనా రోగితో పాటు అతని కుటుంబ సభ్యులను పోలీసులు చితకబాదారు. బాధితుడిని కర్రలతో, లాఠీలతో దారుణంగా కొట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఖండ్వా ఎస్పీ వివేక్ సింగ్ స్పందించి.. కరోనా రోగిపై దాడి చేసిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.






