తెలంగాణలో కొత్తగా… 1,967 కరోనా కేసులు

6

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. రోజూ రెండు వేలకు తగ్గకుండా నమోదైన పాజిటివ్ కేసులు నేడు కొంతమేర తగ్గాయి. కాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,967 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ బారినపడి 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,85,833 కు చేరాయి. మొత్తం మరణాల సంఖ్య 1,100కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 30,234కు చేరింది. మహమ్మారి బారి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయిన వారు 1,54,499 చేరాయి.