- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఖమ్మం జిల్లాలో కరోనా రికార్డు…
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో గురువారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 801 మందికి ఆర్‌టీఏ విధానంలో పరీక్షలు నిర్వహించగా ఏకంగా 194మందికి పాజిటివ్ రావడం గమనార్హం. జిల్లాలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతంలో గాంధీచౌక్‌లో నిర్వహించినప్పుడు 189 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో ఖమ్మం జిల్లాలో మొత్తం 2000 లకు చేరువలో కేసుల సంఖ్య ఉంది. ఇప్పటి వరకూ ఖమ్మం జిల్లాలో 40మంది […]</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో గురువారం రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం 801 మందికి ఆర్‌టీఏ విధానంలో పరీక్షలు నిర్వహించగా ఏకంగా 194మందికి పాజిటివ్ రావడం గమనార్హం. జిల్లాలో ఒకే రోజు ఇన్ని కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గతంలో గాంధీచౌక్‌లో నిర్వహించినప్పుడు 189 కేసులు నమోదయ్యాయి.
తాజాగా నమోదైన కేసులతో ఖమ్మం జిల్లాలో మొత్తం 2000 లకు చేరువలో కేసుల సంఖ్య ఉంది. ఇప్పటి వరకూ ఖమ్మం జిల్లాలో 40మంది కరోనాకు బలయ్యారు. కొత్తగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో జనాలు భయాందోళన చెందుతున్నారు. వారంరోజులుగా వరుస వర్షాలు.. గాలితో తేమ కారణంగా వైరస్ వ్యాప్తి అధికంగా ఉందన్న అభిప్రాయాన్ని వైద్య వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Next Story






