భారత్‌లో కరోనా విజృంభణ

47

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24 గంటల్లో తాజాగా 18,645 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఒక్కరోజే 201 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,04,55,284 కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 1,50,999 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 2,23,335 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,00,75,950 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..