- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తమిళనాడులో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 21 మంది మృతి
by B.Srinivas |
<p>చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే ఆ రాష్ర్టంలో కరోనాతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1685 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తమిళనాడులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 34,914కు చేరింది. ఇప్పటి వరకు తమిళనాడులో 307 మంది మరణించినట్లు ఆ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ వైరస్ నుంచి 18,325 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల్లో […]</p>

X
చెన్నై : తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే ఆ రాష్ర్టంలో కరోనాతో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1685 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తమిళనాడులో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 34,914కు చేరింది. ఇప్పటి వరకు తమిళనాడులో 307 మంది మరణించినట్లు ఆ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ వైరస్ నుంచి 18,325 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల్లో మహారాష్ర్ట మొదటిస్థానంలో ఉండగా, తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ర్టలో పాజిటివ్ కేసుల సంఖ్య 88,529కి చేరుకోగా, 3,169 మంది మృతి చెందారు.
Next Story






