- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023

X
జోద్‌పూర్: రాజస్తాన్‌లోని ఫలోడీ జైలులోని 16 మంది ఖైదీలు పారిపోవడానికి పక్కా స్కెచ్ గీసుకున్నారు. రాత్రి సమయంలో, గార్డులను నమ్మించి వారు ఆదమరిచిన సమయంలో బయటపడాలన్నది ప్లాన్. అనుకున్నట్టుగానే సోమవారం రాత్రి 8.30 గంటలకు గార్డులపై పెప్పర్ పౌడర్ చల్లి 16 మంది ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. దీనిపై జైళ్ల శాఖ సీరియస్ అయ్యింది. హెడ్ కానిస్టేబుల్ సహా నలుగురు అధికారులను బాధ్యతల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఈ రోజు సస్పెండ్ చేసింది. ఫలోడీ పోలీసు స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. పరారైన ఖైదీల కోసం గాలింపులు మొదలయ్యాయని, నిర్లక్ష్యం వహించిన అధికారులపైనా చర్యలు తీసుకున్నామని డీజీ(ప్రిజన్) రాజీవ్ దసోత్ తెలిపారు. జోద్‌పూర్, బికనీర్ సరిహద్దులు మూసేశారు. స్థానిక పోలీసు అధికారులతో గాలింపులు ముమ్మరం చేశారు.
Next Story