- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాష్ట్రంలో కరోనా విజృంభణ.. కొత్తగా 1550
<p>దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతూ, ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1550 కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ కొత్తగా మరో తొమ్మిది మంది వైరస్ మూలంగా మృతిచెందారు. దీంతో మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 36,221కు చేరింది. ఇప్పటివరకూ వైరస్ బారినపడి మృత్యువాత పడిన వారి సంఖ్య 365 చేరింది. ఇప్పటివరకూ కరోనా […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ రోజురోజుకూ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. రోజూ వెయ్యికి పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అవుతూ, ప్రజలను తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తున్నది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1550 కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ కొత్తగా మరో తొమ్మిది మంది వైరస్ మూలంగా మృతిచెందారు. దీంతో మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 36,221కు చేరింది. ఇప్పటివరకూ వైరస్ బారినపడి మృత్యువాత పడిన వారి సంఖ్య 365 చేరింది. ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారి సంఖ్య 23,679 కాగా, చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య 12,178కి చేరింది. ఇవాళ కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 926 కేసులు నమోదు కావడం గమనార్హం. దీంతో పాజిటివ్ వచ్చిన వారితో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారో, అన్న విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
Next Story






