13 ఏళ్ల బాలుడి ఆలోచనకు ఫిదా.. పేటెంట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం

by  |
13 ఏళ్ల బాలుడి ఆలోచనకు ఫిదా.. పేటెంట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్ సంక్షోభంతో కుదేలైన ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మరో పాండమిక్ వస్తే ఎలా? అన్న ఆలోచనే భయాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. అయితే కొవిడ్ తర్వాత ప్రపంచం ఎదుర్కోవాల్సిన మరో అతిపెద్ద సవాల్ ‘నీటి సంక్షోభమే’ అని నిపుణులు అంటున్నారు. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచ జనాభాలో 2.2 మిలియన్ ప్రజలకు సురక్షిత నీరు అందడం లేదు. కాగా భారత్‌లోనూ నీటి సంక్షోభం తాండవించే పరిస్థితులున్నాయని, ఇందుకు జనాభా పెరుగుదలతో పాటు నీటి వనరుల పరిమితికి మించి వాడకమని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో నీటి సంరక్షణకు ఓ 13 ఏళ్ల బాలుడు వినూత్న ఆలోచన చేయగా.. తన థాట్‌ను మెచ్చుకున్న కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కూడా ఇచ్చింది. మరి నీటి పరిరక్షణకు ఆ బాలుడు సూచించిన సొల్యూషన్ ఏంటో? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

ఒడిషా, భువనేశ్వర్‌కు చెందిన సమబేష్ నాయక్ నీటి సంరక్షణ పట్ల అవగాహన ఉన్న వ్యక్తి. మేనేజ్‌మెంట్ స్కూల్‌లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా పని చేస్తున్న తను.. భవిష్యత్తు తరాలకు నీటిని అందించాలంటే ప్రస్తుతం నీటి వినియోగం‌పై శ్రద్ధ వహించాలని ఎప్పుడూ చెప్తుంటాడు. ఇంటి వద్ద కూడా తన భార్య సుచరిత, కుమారుడు ఆయుష్మాన్‌కు నీటి వినియోగం పట్ల అవేర్‌నెస్ కల్పించేవాడు. అంతేకాదు ఇంట్లో ఎంత నీటిని వాడుతున్నాం? ఏ అవసరాలకు ఎక్కువ నీటిని ఉపయోగిస్తున్నాం? అనే విషయాలు తెలుసుకునేందుకు సమబేష్ ఇంటిపై భాగంలో ఓవర్ హెడ్ ట్యాంకు ఏర్పాటు చేసి, ఎప్పటికప్పుడు పరిశీలించేవాడు. ఈ క్రమంలో వాషింగ్ మెషిన్‌కు ఎక్కువ నీరు అవసరమవుతున్నదని గుర్తించి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలా? అని సమబేష్ దంపతులు ఆలోచించేవారు.

కాగా సమబేష్ కొడుకు ఆయుష్మాన్(13 ఏళ్లు).. ప్రస్తుతం కేఐఐటీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏడో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ డిస్కషన్స్ వింటూ వాటర్ కన్జర్వేషన్‌పై తనకంటూ ఓ అభిప్రాయాన్ని ఏర్పరుచుకున్న ఆయుష్మాన్.. వాషింగ్ మెషిన్‌కు ఎక్కువ నీరు అవసరమవుతుందని తెలుసుకున్నాడు. దాన్ని తగ్గించేందుకు వాషింగ్ మెషిన్‌లో ఉపయోగించిన నీటిని రీసైకిల్ చేయాలని, ఇందుకు సెపరేట్ మెషిన్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. ఈ ఆలోచన ఆయుష్మాన్‌కు మూడో తరగతిలో ఉన్నప్పుడే తట్టగా, తన ఆలోచనను ప్రశంసించిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వారు 2017లో ఏపీజే అబ్దుల్ కలాం ఇగ్నైట్ అవార్డు ప్రదానం చేశారు. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా మెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఎన్ఐఎఫ్) ఏటా కేఐఐటీ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్స్ వద్ద నుంచి యూనిక్, ఇన్నోవేటివ్ ఐడియాస్ కోసం దరఖాస్తులు ఆహ్వానించేది. అలా 2017లో ఎన్ఐఎఫ్ తమ స్కూల్‌కు వచ్చినపుడు ఆయుష్మాన్ రెండు యూనిక్ ఐడియాస్ సబ్మిట్ చేశాడు. అందులో ఒకటి రీసైకిల్డ్ వాటర్ యూసేజ్ ఫ్రమ్ వాషింగ్ మెషిన్ కాగా, ఇంకొకటి వర్షంలో ఉన్నపుడు వెలుతురు స్పష్టంగా కనిపించేందుకు వైపర్ హెల్మెట్ తయారీ. వాషింగ్ మెషిన్ ఐడియాకు తాజాగా కేంద్రప్రభుత్వం పేటెంట్ ఇచ్చింది.

వాషింగ్ మెషిన్ సోప్ వాటర్ రీసైక్లింగ్ అండ్ యూసేజ్ థాట్‌ను మెచ్చిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఆయుష్మాన్ తండ్రి పేరిట 20 ఏళ్ల పాటు పేటెంట్స్ ఇచ్చింది. తన ఐడియాకు కేంద్రం ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇవ్వడం ఆనందంగా ఉందని, తన స్నేహితుల నుంచి చాల ప్రశంసలు వచ్చాయని, మొత్తం 69 మందికి యూనిక్ థాట్స్ అవార్డులు వచ్చాయని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు ఆయుష్మాన్. ఇక తమ కుమారుడి ఐడియాకు పేటెంట్స్ వచ్చాయన్న విషయం తమకు తెలియదని ఆయుష్మాన్ తండ్రి సమబేష్ తెలిపాడు. తన కొడుకు చేసిన ఆలోచన ప్రాక్టికల్‌గా వర్కవుట్ కావడంతో తాము హ్యాపీగా ఫీలవుతున్నట్లు తెలిపారు ఆయుష్మాన్ తల్లిదండ్రులు వెల్లడించారు.

మెకానికల్ ఇంజినీర్ కావడమే నా లక్ష్యం..

భవిష్యత్తులో రోజువారి సమస్యలు పరిష్కరించేందుకు మరికొన్ని ఇన్నోవేటివ్ ఐడియాస్ చేస్తాను. నా లక్ష్యం మెకానికల్ ఇంజినీర్ కావడం. ప్రజల ప్రాబ్లమ్స్‌కు యూనిక్ సొల్యూషన్స్ దిశగా ఆలోచిస్తాను. తద్వారా వారికి మేలు జరుగుతుంది.

– ఆయుష్మాన్


Next Story