పురపోరు.. తొలిరోజు 12 నామినేషన్స్ దాఖలు

229

దిశ సిద్దిపేట : సిద్దిపేట మున్సిపాలిటీకి జరగనున్న ఎన్నికలకు మొదటి రోజు 12 మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్‌ల కోసం మున్సిపల్ కార్యాలయంలో 14 కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క కౌంటర్‌లో మూడు వార్డుల చొప్పున కేటాయించారు. ఒక్కొక్క కౌంటర్‌కు ఒక్కొ రిటర్నింగ్ అధికారి, ఒక సహాయ రిటర్నింగ్ అధికారిని నియమించారు. శుక్రవారం తెరాస నుండి 10, కాంగ్రెస్ పార్టీ నుండి రెండు, బీజేపి నుండి రెండు, సీపీఐ పార్టీ నుండి ఒక్కరూ నామినేషన్ దాఖలు చేశారు.

కాంగ్రెస్ నుండి దాసరి రాజు19 వార్డు, గౌస్ మోహినొద్దీన్ చాంద్ 28వ వార్డు నుండి నామినేషన్ వేశారు. సీపీఐ నుండి ఇంజమిర్ నరేష్ 9వ వార్డు నుండి నామినేషన్ ఫైల్ చేశారు. బీజేపి నుండి పెర్క భాను 19వ వార్డ్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తెరాస నుండి మల్యాల జ్యోతి 17వ వార్డ్, గుడాల సంధ్య 34వ వార్డు, కొండం కవిత 4వ వార్డ్, జావేద్ 28వ వార్డ్, వినోద్ గౌడ్ 5వ వార్డు, నీలం నరేష్ 27వ వార్డు, అడ్డగట్ల కావేరి 18వ వార్డు నుండి నామినేషన్లు వేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..