- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అటవీ ప్రాంతాల్లో పోలీసుల గాలింపు.. 11 మంది జూదరులు అరెస్ట్
by Shyam |
<p>దిశ, మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి, దోమెడ గ్రామపంచాయతీల పరిధిలోని అటవీ ప్రాంతంలో పేకాట, కోడి పందాలు ఆడుతున్న 11 మందిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారినుంచి 7 మోటారు సైకిళ్లు, ఒక ఆటో, రూ.8800 నగదు, ఒక కోడి పుంజును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తాహర్ బాబా తెలిపారు. అనంతరం ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు బ్రాహ్మణపల్లి, దోమెడ అటవీ ప్రాంతంలో గాలింపు చేట్టామన్నారు. ఈ క్రమంలో […]</p>

X
దిశ, మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి, దోమెడ గ్రామపంచాయతీల పరిధిలోని అటవీ ప్రాంతంలో పేకాట, కోడి పందాలు ఆడుతున్న 11 మందిని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారినుంచి 7 మోటారు సైకిళ్లు, ఒక ఆటో, రూ.8800 నగదు, ఒక కోడి పుంజును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తాహర్ బాబా తెలిపారు. అనంతరం ఎస్ఐ మీడియాతో మాట్లాడుతూ.. విశ్వసనీయ సమాచారం మేరకు బ్రాహ్మణపల్లి, దోమెడ అటవీ ప్రాంతంలో గాలింపు చేట్టామన్నారు. ఈ క్రమంలో పేకాట ఆడుతున్న కోడం రవీందర్, కోడం సాయిబాబా, సమ్మయ్య, చెంచయ్య, ముఖేష్, రమేష్, హరికృష్ణ, రామారావు, కార్తీక్, రాజు, ఈశ్వర్ అనే పదకొండు మందిపై కేసు నమోదు చేశామని తెలిపారు.
Next Story






