ఉమ్మడి నిజామాబాద్‌లో 104 కేసులు

by Shyam |

<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం 104 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే నిజామాబాద్‌లో 86, కామారెడ్డిలో 18 కేసులు నిర్దారణ అయ్యాయి. నిజామాబాద్ అర్బన్‌లో 66 కేసులు రాగా, చుట్టుపక్కల 20 కేసులు వెలుగుచూశాయి. అందులో ముగ్గురు వైద్యులు ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా వామపక్ష నేత దంపతులకు పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. కాగా, ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 725కు చేరింది. కామారెడ్డిలో మొత్తం [&hellip;]</p>

ఉమ్మడి నిజామాబాద్‌లో 104 కేసులు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సోమవారం 104 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాల వారీగా చూస్తే నిజామాబాద్‌లో 86, కామారెడ్డిలో 18 కేసులు నిర్దారణ అయ్యాయి. నిజామాబాద్ అర్బన్‌లో 66 కేసులు రాగా, చుట్టుపక్కల 20 కేసులు వెలుగుచూశాయి.

అందులో ముగ్గురు వైద్యులు ఉన్నట్లు తేలింది. అంతేకాకుండా వామపక్ష నేత దంపతులకు పాజిటివ్ రిపోర్టులు వచ్చాయి. కాగా, ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 725కు చేరింది. కామారెడ్డిలో మొత్తం 633 కేసులు నమోదు కాగా, ప్రస్తుతం 534 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా సోకి ఇప్పటివరకు ఐదుగురు మరణించగా, 94 మంది కరోనాతో పోరాడి గెలిచారు.

Next Story