సూపర్ సూర్య… ప్రమోషన్స్‌లోనూ సేవ

by  |
సూపర్ సూర్య…  ప్రమోషన్స్‌లోనూ సేవ
X

తమిళ హీరో సూర్య కొత్త చిత్రం సూరరై పొట్రు… ‘ఆకాశమే నీ హద్దురా’ తెలుగు వెర్షన్ టైటిల్. పైలట్ ఆఫీసర్ చంద్రమహేష్ కనయనం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్ అన్ని భాషల్లోను ఆకట్టుకోగా… ఫస్ట్ సాంగ్ రిలీజ్ గ్రాండ్‌గా ప్లాన్ చేశారు. ఎయిరోప్లేన్ కంపెనీని స్థాపించేందుకు ఓ వ్యక్తి పడే తపనే సినిమా. రూ. 6,000 తో సంస్థ ఏర్పాటు చేసి ప్రయాణాన్ని మొదలుపెట్టిన వ్యక్తి తన లక్ష్యాన్ని ఎలా చేరాడు అనేది.. దర్శకులు సుధా కొంగర తెరమీద ఆవిష్కరించనున్నారు. సూర్య, గుణీత్ మోంగ్యా సంయుక్తంగా నిర్మిస్తుండగా మ్యూజిక్ జీవీ ప్రకాశ్ అందించారు.

ఈ సినిమా ఫస్ట్ సాంగ్ లాంచ్ గ్రాండ్‌గా జరిగింది. స్పైస్ జెట్ విమానయాన సంస్థతో కలిసి ఈవెంట్ ప్లాన్ చేసింది చిత్ర యూనిట్. ఎయిరోప్లేన్ కంపెనీ వ్యవస్థాపకుడి కథనే సినిమా కాబట్టి ప్లేన్‌లోనే సినిమా సింగిల్ లాంచ్ చేశారు. అంతేకాదు వంద మంది విద్యార్థులకు తొలిసారి ఫ్లైట్ ఎక్కించే అదృష్టాన్ని కలిగించారు సూర్య. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టే సూర్య విద్యార్థులకు ఫస్ట్ ఫ్లైట్ ఫ్లైయింగ్ అనుభవాన్ని కలిగించడంపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరోవైపు అందరు హీరోలు కేవలం బస్సులు, ఆటోలపై తమ సినిమా పోస్టర్లతో ప్రమోషన్స్ చేస్తే సూర్య ఈ సినిమాకు స్పైస్ జెట్ విమానంపై పోస్టర్లతో తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు. కార్యక్రమానికి సూర్య తండ్రి శివకుమార్, మోహన్ బాబు, చిత్ర నటీనటులు టెక్నీషియన్స్ హాజరయ్యారు. కాగా… జెట్ పై ప్రమోషన్స్ చేసింది ముందుగా సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే ఆ తర్వాత అవకాశం దక్కింది సూర్యకే.



Next Story

Most Viewed