- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
100% కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి : డాక్టర్ నాగేంద్ర ప్రసాద్
by Sridhar Babu |
<p>దిశ, అన్నపురెడ్డిపల్లి : కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని.. ఈనెల చివరి నాటికి నూరు శాతం మందికి టీకా వేయడం పూర్తి చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని ఎర్రగుంట ప్రభుత్వ వైద్యశాలను ఆయన జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ చేతన్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులను, వైద్యశాల పరిసరాలను పరిశీలించారు. పీహచ్‌సీ పరిధిలోని వైద్య సేవల వివరాలను వైద్యాధికారి ప్రియాంకను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో […]</p>

X
దిశ, అన్నపురెడ్డిపల్లి : కొవిడ్ వాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని.. ఈనెల చివరి నాటికి నూరు శాతం మందికి టీకా వేయడం పూర్తి చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. మంగళవారం మండల పరిధిలోని ఎర్రగుంట ప్రభుత్వ వైద్యశాలను ఆయన జిల్లా సర్వైలెన్స్ అధికారి డాక్టర్ చేతన్‌తో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా రికార్డులను, వైద్యశాల పరిసరాలను పరిశీలించారు. పీహచ్‌సీ పరిధిలోని వైద్య సేవల వివరాలను వైద్యాధికారి ప్రియాంకను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






