వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు: సీఎం

by  |
CM KCR
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఇ.డబ్ల్యు.ఎస్.) పదిశాతం రిజర్వేషన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రెండు మూడు రోజుల్లోనే ఈ విషయంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, తగు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలకు తమ రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగిస్తూనే రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే బలహీన వర్గాలకు 50 శాతం మేర రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని.. ఇడబ్ల్యుఎస్‌తో కలుపుకుని ఇకపై 60 శాతం రిజర్వేషన్లు అమలవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.



Next Story