- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూత్ లీడర్ బర్త్ డే.. గిఫ్ట్ కింద పది మందికి కరోనా!
<p>దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెంలో ఓ యువనేత బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న సుమారు 10 మందికి పైగా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో అక్కడకు వెళ్లిన వారంతా కరోనా టెస్టుల కోసం క్యూ కట్టారని సమాచారం. కొత్తపేట నియోజకవర్గంలో ఓ పార్టీకి చెందిన యువనేత పుట్టిన రోజు వేడుకలకు పలువురు కీలక నేతలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అయితే, రావులపాలెంలో ఆ నేతతో పాటు […]</p>

దిశ, వెబ్ డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెంలో ఓ యువనేత బర్త్ డే వేడుకల్లో పాల్గొన్న సుమారు 10 మందికి పైగా కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో అక్కడకు వెళ్లిన వారంతా కరోనా టెస్టుల కోసం క్యూ కట్టారని సమాచారం. కొత్తపేట నియోజకవర్గంలో ఓ పార్టీకి చెందిన యువనేత పుట్టిన రోజు వేడుకలకు పలువురు కీలక నేతలు, ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అయితే, రావులపాలెంలో ఆ నేతతో పాటు మరో 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో ర్యాపిడ్ టెస్టు కిట్స్ తీసుకొచ్చి అందులో పాల్గొన్న అందరికీ కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఈ వేడుకలకు హాజరైన సుమారు వంద మందికి పైగా నేతలు భయాందోళనకు గురవుతున్నారు. వాస్తవానికి ఊబలంక నుంచి కొందరు తిరుమలకు పాదయాత్రగా వెళ్లారు. వారికి దర్శనం చేయించేందుకు ఓ నేత అక్కడకి వెళ్లి వచ్చారు. అనంతరం బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నారు. మరుసటి రోజు ఆయనకు, అతని గన్ మెన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. సదరు నేత ద్వారానే ఈ కరోనా అందరికి వ్యాప్తి చెందినట్లు భావిస్తున్నారు.






