నాన్నే నాకు స్ఫూర్తి.. వైఎస్ ఘాట్ వద్ద జగన్ నివాళి

by Vemula.Srinu Prasad |   (  Updated:2021-09-01 23:52:13  IST  )

<p>దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఆయనతో పాటు తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లి, వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఉన్నారు. ఈ సందర్భంగా తండ్రిని తలుచుకొని సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతకుముందు ట్విట్టర్‌ వేదికగా తండ్రిని తలుచుకున్నారు.. ‘‘నేను వేసే ప్రతీ అడుగులో, ఆలోచనలో నాకు నాన్నే స్ఫూర్తి. నాన్న ఇచ్చిన [&hellip;]</p>

CM Jagan, YSR Ghat
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇడుపులపాయలోని YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఆయనతో పాటు తల్లి విజయమ్మ, భార్య భారతి, చెల్లి, వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిల ఉన్నారు. ఈ సందర్భంగా తండ్రిని తలుచుకొని సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అంతకుముందు ట్విట్టర్‌ వేదికగా తండ్రిని తలుచుకున్నారు.. ‘‘నేను వేసే ప్రతీ అడుగులో, ఆలోచనలో నాకు నాన్నే స్ఫూర్తి. నాన్న ఇచ్చిన స్ఫూర్తే నన్ను అన్నింట్లోనూ ముందుండి నడిపిస్తోంది. ఆయన మాకు దూరమై 12 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు.’’ అని భావోద్వేగ భరితమైన ట్వీట్ చేశారు.

Next Story